తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం - PM MODI SPEECH FROM MOSCOW LIVE - PM MODI SPEECH FROM MOSCOW LIVE

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 12:17 PM IST

PM Modi Speech In Moscow Live : రష్యాలో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన ఇవాళ ఆయన మాస్కోలో భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తాను ఒక్కడినే రాలేదుని 140 కోట్ల మంది ప్రేమను తీసుకువచ్చానని ఈ సందర్భంగా మోదీ అన్నారు. భారత దేశ మట్టి వాసనను మోసుకువచ్చానని తెలిపారు. ఇటీవలే మూడోసారి ప్రధానిగా ప్రమాణం చేశానన్న మోదీ మూడు రెట్ల వేగంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలబెడతానని వాగ్దానం చేశారు. భారత్‌ సాధించిన విజయాలను ప్రపంచం గుర్తిస్తోందని, ఏ దేశానికి సాధ్యంకాని విధంగా చంద్రయాన్‌ ప్రయోగం చేశామని తెలిపారు. చంద్రుని దక్షిణధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా గుర్తింపు పొందామని గుర్తు చేశారు. 'భారత్‌ ఘనతను ప్రపంచం గుర్తించక తప్పని పరిస్థితి తెచ్చాం. దేశంలోని ప్రతీ ఒక్కరిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్యబీమా వ్యవస్థ భారత్‌లో ఉంది. ఆత్మవిశ్వాసం భారత దేశానికి అతిపెద్ద ఆయుధం. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే పటిష్ఠమైనది.' అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details