LIVE : హనుమకొండలో ప్రజాపాలన విజయోత్సవ సభ - VIJAYOTSAVA SABHA LIVE
Published : Nov 19, 2024, 3:40 PM IST
|Updated : Nov 19, 2024, 5:57 PM IST
Prajapalana Vijayotsava Sabha Live : హనుకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అట్టహాసంగా ప్రజాపాలన విజయోత్సవ సభ జరుగుతోంది. ఇక్కడి నుంచే రాష్ట్రవ్యాప్తంగా నిర్మించనున్న 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే ఇటీవలే నిర్మాణం పూర్తైన నయూంనగర్ వంతెన, మత్తుపదార్ధాల నియంత్రణ- ఎన్టీపీఎస్ పోలీస్ స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించారు. మరోవైపు రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు సైతం శంకుస్థాపన చేశారు. బహిరంగ సభ ప్రాంగణానికి ఇందిరా మహిళా శక్తి ప్రాంగణంగా నామకరణం చేశారు. ఈ సభా ఏర్పాట్లను మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చూసుకున్నారు. ఇందిరా మహిళా శక్తి మేళాను ఎంపీ కడియం కావ్య ప్రారంభించారు. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి.. హనుమకొండలో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించారు.. అనంతరం ఆర్ట్ గ్యాలరీని తిలకించారు. అక్కడి నుంచి ఆర్ట్ కళాశాలలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేదికకు చేరుకున్నారు. మహిళా శక్తి మేళాను సందర్శించడంతో పాటు మహిళా శక్తి పథకంలో భాగంగా బ్యాంక్ లింకేజ్ చెక్కులు, బీమా చెక్కులను పంపిణీ చేశారు.
Last Updated : Nov 19, 2024, 5:57 PM IST