LIVE: ఐమాక్స్ గ్రౌండ్స్‌లో సంగీత కార్యక్రమం - CM REVANTH REDDY IN TANKBUND
Published : Dec 8, 2024, 7:31 PM IST
|Updated : Dec 8, 2024, 9:23 PM IST
Praja Palana Vijayotsavalu Live : ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన ఘనంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ ఎయిర్ షో ఘనంగా జరిగింది. భారత వాయుసేనకు చెందిన తొమ్మిది సూర్యకిరణ్ విమానాలు అద్భుతమైన విన్యాసాలు చేశాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎయిర్ షోను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యి వీక్షించారు. రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ కాన్సర్ట్ జరుగుతోంది. నెక్లెస్ రోడ్డులో ఫుడ్, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగుతాయి. బిర్యానీ, చాట్, ఐస్‌క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్ స్టాళ్లు ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. రాజీవ్ గాంధీ విగ్రహం, ఎన్టీఆర్ స్టేడియం, ఫుడ్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన వేదికల వద్ద నేడు, రేపు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సోమవారం(డిసెంబర్ 09న) సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సుమారు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ప్రభుత్వం వసతులు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Last Updated : Dec 8, 2024, 9:23 PM IST