LIVE ముంబయిలో కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ - ప్రత్యక్షప్రసారం - KALKI 2898 AD PRE RELEASE EVENT - KALKI 2898 AD PRE RELEASE EVENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 19, 2024, 6:57 PM IST
|Updated : Jun 19, 2024, 8:09 PM IST
KALKI 2898 AD PRE RELEASE EVENT LIVE : మరో వారం రోజుల్లో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ 'కల్కి'2898 సినిమా గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచాయి. హాలీవుడ్ రేంజ్లో మూవీ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. తాజాగా ముంబయి వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే కల్కి టీమ్ మెంబర్స్ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన స్పెషల్ కార్ బుజ్జితో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాన్ని తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు మూవీ మెయిన్ టీమ్ రంగంలోకి దిగబోతుంది. ముంబయి వేదికగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే కల్కి మెయిన్ టీమ్ అంతా ముంబయిలోనే ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ రిలీజ్ కానుంది.
Last Updated : Jun 19, 2024, 8:09 PM IST