'మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు' - నెల్లూరు జిల్లాలో వెలిసిన ఫ్లెక్సీలు - Vote Not for Sale Posters - VOTE NOT FOR SALE POSTERS
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 9, 2024, 10:26 AM IST
Vote Not for Sale Posters in Nellore District : ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలంటేనే ప్రలోభాలకు వేదికలుగా మారాయి. రాజకీయ పార్టీలు ఓటర్లు తమ వైపునకు తిప్పుకోవడానికి డబ్బులు ఎరవేస్తున్న రోజులివి. ఇలాంటి కాలంలో కూడా తాము ఓట్లు అమ్ముకోమంటూ ఓ గ్రామం ఆదర్శంగా నిలిచింది. తమ గ్రామంలో ఓట్లు అమ్మకానికి లేవంటూ ఆ ఊరివారంతా ఒకే మాట మీద నిలబడి రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్నారు.
'మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు మీకు అన్ని విధాలుగా సహకరిస్తాము మీరు కూడా మా గ్రామ అభివృద్ధి' కి సహకరించాలని గ్రామస్థులందరూ తమ ఇంటి ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన సంఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కాకివాయి గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులందరూ ఒకే నినాదంతో 'మా గ్రామ అభివృద్దే మా లక్ష్యం ఎన్నికల్లో మేము ఎలాంటి తాయిలాలకు మా ఓట్లు అమ్ముకొము, మా గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే మా ఓట్లు' అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముందు 'నా ఓటు అమ్మకానికి లేదు' అనే స్టిక్కర్లు అంటించారు. ఊరిలో పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 13న జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ప్రతి ఓటు యొక్క ప్రాముఖ్యతను గ్రామస్థులకు వివరించారు. 'నా ఓటు నా భవిష్యత్తు- ఒక ఓటు యొక్క శక్తి' కూడా నా ఓటు తో నా గ్రామ అభివృద్ధి అనే నినాదాన్ని ప్రజలు నడుం బిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అన్ని పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.