ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 3, 2024, 9:06 PM IST

ETV Bharat / videos

డ్రోన్‌ కెమెరాలతో పల్నాడులో పోలీసుల పహారా! - Police Surveillance With Drone

Police Surveillance With Drone Cameras to Prevent Violent Incidents: పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో అసాంఘిక సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు ఏరాట్లు చేశారు. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్(SP Mallika Garg) ఆదేశానుసారం సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో పోలీసులు పరిశీలించారు. మెుదట ప్రజల మధ్య డ్రోన్ ఎగవేసి ట్రల్ రన్ నిర్వహించారు. ఎటువంటి అల్లర్లు జరిగినా గొడవలకు ప్రోత్సహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయకూడదన్నారు. కౌంటింగ్ జరిగే ప్రాంతంల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. ఫలితాలు వెలువడనుండటంతో సున్నితమైన గ్రామాలలో జరిగే ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించేలా చాటర్ డ్రోన్​లను ఉపయోగిస్తున్నారని, బయటకు వచ్చి చిందులేయలనుకునే వాళ్లు డ్రోన్ వీడియోలో కనిపిస్తే కటకటాల్లోకి వెళతారని హెచ్చరించారు. అదేవిధంగా రోడ్లు విశాలంగా ఉన్నాయని ద్విచక్ర వాహనాలపై చక్కర్లు కొడుతున్న వారెవరైనా సరైన పత్రాలు లేకపోతే వాహనాలను సీజ్ చేస్తామని ఇప్పటికే తనిఖీలు చేపట్టి పదుల సంఖ్యలో ద్విచక్రవాహనాలను స్టేషన్​కు తరలించామని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details