గంజాయి విక్రయం - నలుగురు యువకులు అరెస్ట్ - గంజాయి విక్రయిస్తుండగా అరెస్ట్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 2:15 PM IST
Police siezed ganja In Guntur District : గుంటూరు జిల్లా చేబ్రోలులో గంజాయి (ganajai) వినియోగంతో పాటు గంజాయి విక్రయిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాల వద్ద గంజాయి విక్రయించేందుకు వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి వద్ద కేజీ గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెనాలి డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. నిందితులు (Accused) పొన్నూరుకి చెందిన షేక్ ఫజల్, కట్టెంపూడికి చెందిన యశ్వంత్, మరో ఇద్దరు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. గంజాయి వినియోగం, విక్రయాల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
కొంతకాలంగా చీరాల రైల్వే స్టేషన్ వద్ద గంజాయి దొరకపోవడంతో దానికోసం అన్వేషిస్తున్న క్రమంలో ఒడిశాకు చెందిన వ్యక్తి పత్తిపాడు మండలం బోయపాలెంలో బడ్డీ కొట్టు పెట్టుకుని గంజాయి (Marijuana) అమ్ముతున్నట్లు తెలుసుకున్నారు. ఈనెల 18వ తేదీన అతడిని కలిసి సుమారు రూ. 30 వేలు చెల్లించి కేజీ గంజాయి తీసుకొని పొన్నూరు వచ్చారు. అక్కడ ఓ బాలుడు దిగిపోయి మరో బాలుడితో కలసి చేబ్రోలులోని ఇంజనీరింగ్ కళాశాల వద్ద గంజాయిని అమ్మేందుకు తీసుకువస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.