ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉచిత ఇసుక అమలులోకి వచ్చినా ఆగని అక్రమ ఇసుక తరలింపు - Police Seized Illegal Sand Lorries - POLICE SEIZED ILLEGAL SAND LORRIES

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 6:56 PM IST

Police Seized 7 Illegal Sand Lorries in East Godavari District: ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని అమలులోనికి తెచ్చినప్పటికీ అక్రమార్కులు మాత్రం తమ పంథాను మార్చుకోవడం లేదు. అర్ధరాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా బిల్లులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. అలానే తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. అక్రమార్కులు ఇసుకను అధికారుల కళ్లు కప్పి తరలిస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే నిడదవోలు ఎస్​ఈబీ (Special Enforcement Bureau) అధికారులు అక్రమంగా తరలిస్తున్న 7 లారీల ఇసుకను పట్టుకున్నారు. గోపాలపురం ఇసుక రీచ్ నుంచి ఏడు లారీల్లో సుమారు 150 టన్నుల ఇసుకను ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు. విశ్వసనీయంగా వచ్చిన సమాచారంతో ఎస్​ఈబీ అధికారులు పెరవలి వద్ద తనిఖీలు నిర్వహించి లారీలలో తరలిస్తున్న ఇసుకను పట్టుకున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా బిల్లులు లేకుండా తరలిస్తుండడంతో ఇసుకను లారీలను స్వాధీనం పట్టుకున్నామని నిడదవోలు ఎస్​ఈబీ సీఐ దొరబాబు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details