తెలంగాణ

telangana

ETV Bharat / videos

గోవా నుంచి మద్యం ఎలా తేవాలో చూపించాడు - కటకటాల పాలయ్యాడు - Liquor Smuggled From Goa - LIQUOR SMUGGLED FROM GOA

By ETV Bharat Telangana Team

Published : Jul 14, 2024, 2:08 PM IST

Liquor Smuggled From Goa : గోవా నుంచి మద్యం ఎలా తేవాలో వీడియోలో చెబుతూ హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు తెలిపిన సమాచారం ప్రకారం... జూబ్లీహిల్స్ రోడ్ నంబరు- 2 ప్రాంతానికి చెందిన బి. ఆనంద్​పాల్ అలి యాస్ కోటి యాదవ్ ఇటీవల గోవా వెళ్లి వచ్చాడు. అక్కడ ఖరీదైన మద్యం కొనుగోలు చేశాడు. దర్జాగా నగరానికి తీసుకొచ్చాడు. ఇదే విషయాన్ని వీడియో రూపంలో పంచుకున్నాడు. గోవాలో కొనుగోలు చేసిన మద్యం సీసాలను ఎంత భద్రంగా పార్శిల్ చేసింది. విమానాల్లో తీసుకొచ్చేందుకు వీలుగా ఎలా వ్యవహరించాలనే అంశాలను వీడియో రూపంలో పంచుకున్నాడు. దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశాడు. ఆ వీడియో ఎక్సైజ్ పోలీసుల దృష్టికి వెళ్లటంతో శనివారం నిందితుడి నివాసంలో సోదాలు నిర్వహించారు. గోవా నుంచి అక్రమంగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ నగరానికి తీసుకురా వటంపై కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలకు నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. 

ABOUT THE AUTHOR

...view details