ఆదోనిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్- పోలీసుల అదుపులో ఇద్దరు - IPL CRICKET BETTING - IPL CRICKET BETTING
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2024, 1:18 PM IST
Police Arrested Two for IPL Cricket Betting In Kurnool District : కర్నూలు జిల్లా ఆదోనిలో ఐపీఎల్ (IPL) క్రికెట్ బెట్టింగ్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. బొబ్బులమ్మ గుడి సమీపంలో రామాంజనేయులు, సయ్యద్ బాషా కలిసి కర్ణాటక మద్యం విక్రయిస్తూ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడులు చేసి వారిని అదుపులో తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల వద్ద ఉన్న 70 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు, లక్ష రూపాయలు నగదును సీజ్ చేసినట్లు ట్రైనీ డీఎస్పీ ధీరజ్ కుమార్ తెలిపారు.
నిందితులను విచారించగా వీరితో పాటు మరింకొందరు ఈ బెట్టింగ్ స్కామ్లో అనుసందానమై ఉన్నట్లు తెలుస్తుందని ట్రైనీ డీఎస్పీ ధీరజ్ కుమార్ తెలిపారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత తప్పుడు మార్గాల్లో డబ్బు సంపాదించడం చాలా ప్రమాదకరమని సూచించారు. తల్లిదండ్రులు వారి పిల్లలు చెడు అలవాట్లకు లోనయినట్లనిపిస్తే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.