ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఇళ్లు, గుళ్లు, రైస్ మిల్లులే లక్ష్యంగా చోరీలు - భారీగా బంగారం రికవరీ చేసిన పోలీసులు - Police Arrested Thieves gang - POLICE ARRESTED THIEVES GANG

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 12:30 PM IST

Police Arrested a Gang Committing Theft in Temple in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో దేవాలయాల్లో తరుచూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు 32 ఆలయాలతో పాటు మూడు రైస్ మిల్లులు, నాలుగు ఇళ్లలో దొంగతనాలు చేశారని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి 692 గ్రాముల బంగారం, 52 కేజీల 880 గ్రాముల వెండి, 3 లక్షల 38వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించామన్నారు.

నాలుగు బైక్​లు (Bike) కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలు లేని ఆలయాలను లక్ష్యంగా వీరు దొంగతనాలు చేస్తున్నారని, కొన్ని మందిరాల్లో వాటిని కట్​ చేస్తున్నారని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. నిందితుల నుంచి కేవలం గుళ్లు, రైసు మిల్లులో దోచున్న రూ. 92 లక్షల విలువైన ప్రాపర్టీని రికవరీ చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details