ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

చొక్కా విప్పితే ₹20లక్షలు- అనంతపురం పోలీసులు షాక్ - Large Amount Transport - LARGE AMOUNT TRANSPORT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 9, 2024, 12:28 PM IST

Police Arrest Person Large Amount Transport in Anantapur District : ఎన్నికల కోడ్​ వెలువడిన నేపథ్యంలో పోలీస్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.20 లక్షల నగదు పట్టుబడిందని అనంతపురం వన్​టౌన్​ పోలీసులు తెలిపారు. నగర సమీపంలోని ఐరన్​ బ్రిడ్జి వద్ద రూ.20 లక్షల నగదు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్వి చక్ర వాహనంపై ఓ వ్యక్తి  రూ.20 లక్షల నగదును తరలిస్తున్నారు. పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేయగా నగదు బయటపడింది. 

పట్టుబడిన నగదును రహదారి పైనే పోలీసులు లెక్కించారు. దాదాపు రూ.20 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నగదుతో పాటు డబ్బు తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని వన్​టౌన్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. పట్టుబడిన నగదును సీజ్​ చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ తనిఖీల్లో భాగంగానే ఓ కారులో భారీగా బంగారం, నగదు పట్టుబడినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని సీఐ రెడ్డప్ప వివరించారు. 

ABOUT THE AUTHOR

...view details