LIVE: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - దిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం - PM Narendra Modi Oath Ceremony LIVE - PM NARENDRA MODI OATH CEREMONY LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 9, 2024, 6:41 PM IST
|Updated : Jun 9, 2024, 9:57 PM IST
PM Narendra Modi Oath Ceremony LIVE: మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం సిద్దమయ్యారు. రాత్రి 7.15 గం.కు రాష్ట్రపతి భవన్‌లో మోదీ ప్రమాణ స్వీకారం చేపట్టనున్నారు. వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారు. నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రులుగా పలువురు ప్రమాణస్వీకారం చేపట్టనున్నారు. అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీకి మంత్రి పదవులు దక్కుతాయని సమాచారం అందుతోంది. పీయూష్, అశ్వినీ వైష్ణవ్, మాండవీయ ప్రమాణం చేసే అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. మరోవైపు మోదీ 3.0 కేబినెట్‌పై ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి భవన్ చుట్టూ బహుళ అంచెల భద్రతా కొనసాగుతుంది. దిల్లీలో సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. 5 కంపెనీల కేంద్ర బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమాండోల మోహరించారు. రాష్ట్రపతిభవన్ వద్ద 2,500 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
Last Updated : Jun 9, 2024, 9:57 PM IST