LIVE : వేములవాడలో ప్రధాని మోదీ బహిరంగ సభ - PM MODI Vemulawada Live - PM MODI VEMULAWADA LIVE
Published : May 8, 2024, 10:23 AM IST
|Updated : May 8, 2024, 11:09 AM IST
PM Modi Vemulawada Public Meeting Live : రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తోన్నారు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదారాబాద్‌కు చేరుకున్నమోదీ రాత్రి రాజ్‌భవన్‌లో బస చేశారు. ఎనిమిదిన్నర సమయానికి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరి అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకున్నారు. శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా ప్రచార సభలో మోదీ పాల్గొని ప్రసంగిస్తున్నారు. అనంతరం వరంగల్ పార్లమెంటు బీజేపీ అభ్యర్ధి అరూరి రమేష్ గెలుపు కోరుతూ ప్రధాని మోదీ వరంగల్‌లో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభలకు స్థానిక పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Last Updated : May 8, 2024, 11:09 AM IST