Live: భారీ వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టు భారీ గండి - Pedda Vagu Project Broken Live - PEDDA VAGU PROJECT BROKEN LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 19, 2024, 11:01 AM IST
|Updated : Jul 19, 2024, 12:11 PM IST
Pedda Vagu Project Broken Live : పెద్దవాగుకు గండితో దిగువన అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి, కోయరంగాపురం, కొత్తూరు, రమణక్కపేట గ్రామాలకు పాక్షికంగా నష్టం జరగ్గా ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, కోయమాదారం, కొత్తపూచిరాల, పాతపూచిరాల, అల్లూరినగర్, సొందిగొల్లగూడెం, వసంతవాడ, గుళ్లవాయి, వేలేరుపాడు గ్రామాలకు భారీగా నష్టం సంభవించింది. కొన్ని గ్రామాల్లో పలు ఇళ్లు వరదలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు వరద ప్రభావిత ప్రాంతాలకు అధికారులు చేరుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారంతా వేలేరుపాడులోనే ఉండిపోయారు. దాదాపు 2000 కుటుంబాలు ఎవరి దారిన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకుంటున్నట్లు సమాచారం. గురువారం ఉదయం నుంచి విద్యుత్తు సరఫరా కూడా లేకపోవడంతో సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు. బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. పెద్దవాగుకు గండిపడిన నేపథ్యంలో ప్రాణనష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. విగండి పూడ్చేందుకు రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని జలవనరులశాఖ డీఈ కృష్ణ తెలిపారు. ప్రస్తుతం పెద్దవాగు వద్ద పరిస్థితిని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.
Last Updated : Jul 19, 2024, 12:11 PM IST