తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : ఏపీ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ ప్రెస్​మీట్​ - Deputy CM Pavan Press Meet LIVE - DEPUTY CM PAVAN PRESS MEET LIVE

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 2:10 PM IST

Updated : Sep 4, 2024, 2:49 PM IST

Pawan Kalyan Live : గత ప్రభుత్వ వైఖరి వల్లే విజయవాడ నగరంలో వరదలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ అన్నారు. బుడమేరును పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు చిన్న చిన్న నీటి పాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే సమయం కాదని బాధితులను రక్షించాలన్నారు.  వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ, తన వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావించి పర్యటించలేదని పవన్ వివరించారు.తన పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం విజయవాడలో వరద తగ్గుతోందని అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ప్రకృతి విపత్తుల సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని పేర్కొన్నారు. భవిష్యత్​లో ఇలాంటివి విపత్తులు జరగకుండా ఏం చేయాలనేది మంత్రి వర్గంలో చర్చిస్తామని ​ వెల్లడించారు. ప్రతి నగరానికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేస్తామని పవన్ వివరించారు. తాజాగా ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
Last Updated : Sep 4, 2024, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details