ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ - ప్రత్యక్ష ప్రసారం - Pawan Kalyan Pensions Distribution - PAWAN KALYAN PENSIONS DISTRIBUTION

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 10:41 AM IST

Updated : Jul 1, 2024, 12:08 PM IST

Pawan Kalyan Pensions Distribution live From Gollaprolu : మూడు రోజులు కాకినాడ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన జరగనుంది. ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు పవన్​ కళ్యాణ్​ గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీని కార్యక్రమంలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 12.30 వరకు పింఛన్ల పంపిణీలో పవన్‌  పాల్గొననున్నారు. మధ్యాహ్నం నుంచి పిఠాపురం జనసేన నాయకులతో పవన్‌ సమావేశం నిర్వహిస్తారు. రేపు కాకినాడ కలెక్టరేట్‌లో కీలక శాఖలతో పవన్‌ సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. బుదవారం ఉదయం ఉప్పాడ తీరంలో సముద్ర కోత సమస్యను పరిశీలించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి బహిరంగ సభలో పాల్గొననున్నారు. పెంచిన పింఛన్ 4వేల రూపాయలు ఏప్రిల్, మే, జూన్ నెలలది వెయ్యి చొప్పున కలిపి ఈ నెల 7వేల రూపాయలు ఇవ్వడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో 3వేల రూపాయల పింఛన్ వచ్చేదని లబ్ధిదారులు అన్నారు. కూటమి ప్రభుత్వం 4వేల రూపాయల పింఛన్ ను ఇచ్చిందని సంతోషం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకేసారి వెయ్యి రూపాయలు పింఛన్ పెంచడం ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీని కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్​ ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Jul 1, 2024, 12:08 PM IST

ABOUT THE AUTHOR

...view details