ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు - Pavitrotsavalu on Indrakiladri - PAVITROTSAVALU ON INDRAKILADRI
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 18, 2024, 4:17 PM IST
Pavitrotsavalu Started on Vijayawada Indrakiladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆద్వర్యంలో పవిత్రోత్సవములు ప్రారంభం అయ్యాయి. ఈ రోజు నుంచి ఈ నెల 20 వరకు దేవస్థానంలో పవిత్రోత్సవములు కొనసాగనున్నాయి. ఈ రోజు ఉదయం 3 గంటలకు అమ్మవారికి సుప్రభాతం, స్నపనాభిషేకం, అనంతరం ప్రాతః కాలార్చన నిర్వహించారు. ఆ తరువాత 9 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనం కోసం అనుమతించారు. ఆలయ కార్యనిర్వాహనాధికారి సమక్షంలో వైదిక సిబ్బంది, అర్చకులు విగ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, అగ్నిప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత్త విధులు నిర్వహించారు. తదుపరి అమ్మవారు, స్వామివారు,ఉపాలయములలోని దేవతలకు శాస్త్రోక్తంగా పవిత్ర మాలాధారణ చేసారు. ఈ 3 రోజులు దేవస్థానము నందు జరుగు అన్ని ఆర్జిత సేవలు ఆపేయడం జరిగింది. అమ్మవారికి నిర్వహించు అన్ని నిత్య కైంకర్యములను దేవస్థాన అర్చకులు మాత్రమే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుటున్నారు.