ETV Bharat / state

కడియం నర్సరీలో సరికొత్త అందాలు - NEW YEAR SPECIAL IN KADIYAM NURSERY

దేశ విదేశాలకు చెందిన మొక్కలు, పూలతో నర్సరీకి కొత్త కళ - ఉద్యానవనానికే ప్రత్యేక ఆకర్షణగా పూలు

new_year_special_decoration_in_kadiyam_nursery
new_year_special_decoration_in_kadiyam_nursery (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 2, 2025, 2:08 PM IST

New Year Special Decoration in kadiyam Nursery : నూతన సంవత్సర వేళ తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు సరికొత్త అందాలు సంతరించుకున్నాయి. దేశ విదేశాలకు చెందిన మొక్కలు, పూలతో నర్సరీకే కొత్త కళ వచ్చింది. దేశవాళీ పూలైన బంతి, చామంతి మొదలుకొని విదేశాలకు చెందిన థాయ్‌ బొన్సాయ్‌లకు పూసిన రంగురంగుల పూలు ఉద్యానవనానికే ప్రత్యేక ఆకర్షణ తెచ్చాయి.

నూతన సంవత్సర వేళ కడియం నర్సరీలో సరికొత్త అందాలు (ETV Bharat)

కడియం నర్సరీలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన విరుల వనాలు. వేలాది రకాల మొక్కలు, వృక్ష జాతులతో అలరారుతున్నాయి. దశాబ్దాలుగా సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అలాంటి ఇక్కడ విదేశీ మొక్కల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఎక్కడో సప్త సముద్రాల అవతల పుట్టి, పెరిగిన విదేశీ మొక్కలు, వృక్షాలు కూడా ఈ కడియం నర్సరీలకు వచ్చి ప్రత్యేకత సంతరించుకుంటున్నాయి. ఇక్కడి నుంచి దేశవ్యాప్తంగా కొనుగోలుదారుల ఇళ్లు, కార్యాలయాలు, ఉద్యానాల్లోకి చేరి సందడి చేస్తున్నాయి. అలాంటి కొన్ని విదేశీ మొక్కలు, ఇక్కడ ప్రత్యేకం.

అద్భుతం - ఒకే చెట్టుకు విరబూసిన 20 బ్రహ్మ కమలాలు - 20 Brahma Kamalam Flowers at a Time

ఇక్కడ మనసును కట్టిపడేసే వాతావరణం, రంగు రంగుల పూలు చూపరుల మదిని దోచుకోవడం కాయం. ఆలాంటి ఈ నర్సరీ గురించిన మరిన్ని వివరాలు ఈ టీవీ ప్రతినిధి సాయి కృష్ణ అందిస్తారు.

"ముద్దబంతికి దగ్గరి బంధువులేమో!" - పూలబొకేను తలపిస్తున్న 'మూన్‌ కాక్టేసీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.