Government cancel deal on Shirdi Sai Electricals : వైఎస్సార్సీపీ పాలనలో అందిన కాడికి దండుకున్న జగన్ అస్మదీయ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కూటమి సర్కార్ మొదటిషాక్ ఇవ్వబోతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు ప్రక్రియను రద్దు చేయనుంది. అదంతా వృథా ఖర్చంటూ ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోనుంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అస్మదీయులకు లబ్ధి చేకూరుస్తూ తీసుకున్న పలు నిర్ణయాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు పనులను రద్దుచేయనుంది. గత ప్రభుత్వంలో రాష్ట్ర విద్యుత్‌రంగాన్ని శాసించిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు ఇది శరాఘాతమే! రైతుల నుంచి వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోకుండా జగన్ ప్రభుత్వం 18లక్షల 58వేల వ్యవరాయ పంపుసెట్లకు స్మార్ట్‌మీటర్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. 2 శాతం అదనపు రుణం కోసం మీటర్లు ఏర్పాటుచేస్తున్నట్లు చెబుతున్నా అస్మదీయ సంస్థ షిర్డీసాయికి లబ్ధి చేకూర్చడమే అంతిమ లక్ష్యంగా ప్రాజెక్టును రూపొందించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 50వేల కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లను ఏర్పాటుచేశారు. మిగిలిన కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లపై ముందుకు వెళ్లకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
వైఎస్సార్సీపీ నేతల కళ్లలో సంతోషం కోసం - జగన్ అస్మదీయ కంపెనీకి 'రిపీట్' దోపిడీ
వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్‌మీటర్లు, అనుబంధ పరికరాల కోసం జగన్ ప్రభుత్వం తొలిసారి 2020లో రూ.6,480 కోట్ల ప్రతిపాదనలతో టెండర్లు పిలిచింది. ఈ ధరలపై ఆరోపణలు రావడంతో టెండర్ల ప్రక్రియను రద్దుచేసింది. రెండోసారి అనుబంధ పరికరాలు, స్మార్ట్‌మీటర్లు, నిర్వహణ పనులుగా విడగొట్టి వేర్వేరుగా టెండర్లు పిలిచింది. దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్కో కనెక్షన్‌కు సుమారు 35వేల చొప్పున ధరలను నిర్ణయించింది. స్మార్ట్‌మీటర్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనేదానిపై పైలట్ ప్రాజెక్టులు లేకుండానే గత ప్రభుత్వం ముందుకు వెళ్లింది. రైతులు, రైతు సంఘాల వ్యతిరేకతనూ పట్టించుకోలేదు. చివరకు వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెడితే విద్యుత్ ఆదా అయిందని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టుతో ఇది రుజువైందంటూ YCP ప్రభుత్వం ఊదరగొట్టింది.
షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కార్యాలయంలో సోదాలు - భారీగా డబ్బు ఉందన్న సమాచారం
ఐతే ఈ మాటల్లో నిజంలేదని, పైగా ప్రజాధనం వృథా అని పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్‌తో ఆర్థికశాఖ చేయించిన అధ్యయనంలో తేల్చింది. పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర మీటరింగ్, ఫీడర్ మీటరింగ్ విధానంలో కొద్ది మొత్తం అదనపు ఖర్చుతో విద్యుత్ ఆడిట్‌కు అవకాశం ఉందని నివేదించింది. దీని ఆధారంగా వ్యవసాయ విద్యుత్ వినియోగం, నష్టాల్ని తేలిగ్గా అంచనా వేయొచ్చని పీఈజీ చెప్పినా భారీ మొత్తం వెచ్చించి ప్రజలపై భారం వేయడానికే జగన్ ప్రభుత్వం మొగ్గుచూపింది. స్మార్ట్‌మీటర్లకు పెట్టే రూ.6,500 కోట్లను ఐదేళ్లలో వెనక్కి రాబట్టుకోగలమని గత ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేసింది.