Explosion in Borewell at Adoni : కర్నూలు జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. ఆదోని మండలంలోని చిన్నపెండెకల్‌లో ఓ బోరుబావిలో పేలుడు సంభవించింది. పొలంలో కొత్తగా వేసిన బోరుబావిలో పైపులు దించుతుండగా ఈ ఘటన జరిగింది. ఈ క్రమంలో ముగ్గురు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వారిని ఆదోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొబ్బరి చెట్టుపై పిడుగు - బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - ఇద్దరు మృతి