సమస్యలకు నిలయాలుగా డయాలసిస్ సెంటర్లు!- ఏసీల్లో ఎలుకలు - Problems at Dialysis Centre - PROBLEMS AT DIALYSIS CENTRE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 4, 2024, 12:03 PM IST
Patients Facing Problems at Hindupur Dialysis Centre: సత్యసాయి జిల్లా హిందూపురంలో డయాలసిస్ బాధితులకు ఆసుపత్రిలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. నెఫ్రోకేర్ డయాలసిస్ కేంద్రంలో సరైన సౌకర్యాలు లేక డయాలసిస్ బాధితులు అనేక అవస్థలు పడుతున్నారు. కేంద్రంలో ఉన్న ఆరు ఏసీలు ఎలుకలకు నిలయంగా మారాయి. మూడు నెలల నుంచి ఏసీలు నిరుపయోగంలో ఉన్నప్పటికీ ఆసుపత్రి నిర్వహణ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫ్యాన్లు ఉన్నా అవి కేవలం యంత్రాలకే పరిమితమయ్యాయి. డయాలసిస్ చేయించుకోనే బాధితులు ఉక్కపోత మధ్య వైద్య సేవలు పొందాల్సిన దుస్థితి ఏర్పడింది. సౌకర్యాల ఏర్పాటులో అధికారుల నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
"నెఫ్రోకేర్ డయాలసిస్ కేంద్రంలో ఏసీలు ఎలుకలకు నిలయంగా మారాయి. మూడు నెలల నుంచి ఏసీలు నిరుపయోగంలో ఉన్నప్పటికీ ఆసుపత్రి నిర్వహణ అధికారులు పట్టించుకోవడం లేదు. ఫ్యాన్లు ఉన్నా అవి కేవలం యంత్రాలకే పరిమితమయ్యాయి. దీంతో ఉక్కపోత మధ్య వైద్య సేవలు పొందాల్సిన దుస్థితి ఏర్పడింది." - డయాలసిస్ పేషెంట్