చాంగు భళా సృష్టి కళ - పెద్దపల్లి జిల్లాలో పాండవలంక జలపాతం అద్భుతహ - PANDAVALANKA WATERFALLS - PANDAVALANKA WATERFALLS
Published : Aug 29, 2024, 2:19 PM IST
Pandavalanka Waterfalls in Peddapalli District : పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పాండవ లంక జలపాతం పర్యటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఆకు పచ్చటి తివాచీ పరిచినటువంటి కొండలు , అందులోంచి జాలు వారుతున్న జలపాతాన్ని చూసి పర్యటకులు కేరింతలతో సందడి చేస్తున్నారు. వెన్నంపల్లి గ్రామ శివారులోని రామగిరి కిల్ల గుట్టలకు ఆనుకొని ఉన్న ఈ పాండవ లంక జలపాతం ఎంతో ప్రసిద్ధిగాంచింది. పాండవులు అరణ్యవాసం చేసిన సమయంలో ఇక్కడ కొంతకాలం నివాసం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఈ జలపాతంలో పాండవులు సైతం జలకాలు ఆడినట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో జలపాతం కొండల్లో నుంచి కిందికి దూకుతుండడంతో పర్యటకుల తాకిడి పెరిగింది. కానీ జలపాతానికి వచ్చేందుకు రహదారి మార్గం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సందర్శకులు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని సరైన రోడ్డు మార్గం వేయడంతో పాటు ప్రాంతాన్ని పెద్ద పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.