40రోజుల్లో కంప్లీట్- అది కనిపెడితే వెండి- 'రావణ్'తో ఈటీవీ భారత్ చిట్‌చాట్ - Operation Raavan Movie - OPERATION RAAVAN MOVIE
Published : Jul 22, 2024, 5:01 PM IST
|Updated : Jul 22, 2024, 5:06 PM IST
Operation Raavan Team ETV Bharat: 'పలాస' ఫేమ్ హీరో రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ రావణ్'. ఈ సినిమాకు రక్షిత్ తండ్రి వెంకట సత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాతోనే వెంకటసత్య డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు. సస్పెన్స్ సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో కేవలం 40రోజుల్లోనే సినిమాను తెరకెక్కించారు. ఇక జులై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా హీరో రక్షిత్, దర్శకుడు వెంకట సత్య ఈటీవీ భారత్‌తో ముచ్చటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక సినిమాలో సైకో పాత్ర పోషించిన నటుడిని గుర్తుపట్టి, అతడి పేరును వాట్సాప్ చేసిన తొలి 50 మంది ప్రేక్షకులకి సిల్వర్ కాయిన్ గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెంకట సత్య చెప్పారు. ఇంకా సినిమా గురించి ఆయన షేర్ చేసుకున్న మరిన్ని విషయాలు తెలుసుకోడానికి పూర్తి వీడియో చూసేయండి.