తెలంగాణ

telangana

ETV Bharat / videos

అన్నపూర్ణా దేవిగా దర్శనమిస్తున్న ఏడుపాయల వన దుర్గమ్మ - EDUPAYALA TEMPLE IN MEDAK - EDUPAYALA TEMPLE IN MEDAK

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2024, 10:39 AM IST

Edupayala Temple in Medak : మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణా దేవి రూపంలో నీలం రంగు వస్త్రాలతో భక్తులకు దర్శనం ఇచ్చారు. సింగూర్ నుంచి నీటిని విడుదల చేయడంతో వనదుర్గ ఆనకట్ట పొంగి పొర్లుతోంది. ఈ క్రమంలో గర్భగుడిలోకి ఆలయ అర్చకులు మాత్రమే వెళ్లి అమ్మవారికి మంజీరా జలాలతో అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంజీరా నది పాయ ఆలయం ముందు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రధాన ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భక్తుల దర్శనం కోసం రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. రాజగోపురంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మెదక్​ జిల్లాలో భారీ వర్షాలు పడిన ప్రతి సందర్భంలోనూ వనదుర్గా మాత ఆలయం జలదిగ్భందంలో చిక్కుకుంటోంది. సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details