దగా డీఎస్సీ వద్దంటూ ఎన్‍ఎస్‍యూఐ ఆందోళన - మంత్రి ఇంటి ముట్టడికి యత్నం - ఎన్‍ఎస్‍యూఐ యూత్ కాంగ్రెస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 12, 2024, 3:54 PM IST
NSUI Youth Congress Protest For Mega DSC Notification: ముఖ్యమంత్రి జగన్ నిరుద్యోగులను మోసం చేశారంటూ ఎన్‍ఎస్‍యూఐ యూత్ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ యువత తిరుపతిలో నిరసన చేపట్టారు. దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించారు. నిరసనలో భాగంగా బాలాజీ కాలనీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్‍ఎస్‍యూఐ నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నాలుగున్నర సంవత్సరాలుగా యవతను మోసం చేశారని ఆరోపించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి మెుండిచేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ను నమ్ముకొని ఓటేసిన యువతను నట్టేట ముంచారని ఆరోపించారు. యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోయారని, డిఎస్సీ అంటూ కాలయాపన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఇప్పుడు దగా డీఎస్సీని వదిలారని ఎన్‍ఎస్‍యూఐ నేతలు మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి ముందు నిరసన తెలియజేస్తున్న కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ యువతను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.