ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వాలు జడ - నోబెల్​ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్​ - Nobel Award to Long Hair

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 11:09 AM IST

Nobel Award to Long Hair: కురులతోనే మగువల అందం ఇనుమడిస్తోంది. పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు ఇలా కారణం ఏమైనా కావచ్చు. ప్రస్తుత సమాజంలో జుట్టు రాలిపోవడాన్ని చాలా మంది ఎదుర్కొంటున్నారు. ఎన్ని రకాల బ్రాండ్ల నూనెలు తలకు వాడినా కొన్ని సందర్భాల్లో ఫలితం శూన్యం. అలాంటిది పల్నాడు జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ మహిళ తన పొడవాటి జుట్టుతో నోబెల్​ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 72 సంవత్సరాలు గల ఈ మామిళ్ల విజయలక్ష్మి జుట్టు 138 సెంటీమీటర్లు (4.5 అడుగులు) పొడవు పెరిగింది. ఇంత పెద్ద జడ ఆమె సొంతం కావడంతో ఈ నెల 13న ఆమెను అవార్డు వరించింది.

ఎలాంటి ఒత్తడి లేకుండా ఆనందకరమైన జీవితం గడపడమే, జుట్టు పెరుగుదలకు కారణమని అవార్డు గ్రహిత విజయలక్ష్మి చెబుతున్నారు. జుట్టు సంరక్షణకు సహజ పద్ధతులు అవలంబిస్తున్నట్లు ఆమె వివరించారు. బయటకు వెళ్లనప్పుడు తన పొడవైన జడను చూసి చాలా ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. కొంతమంది అయితే సెల్ఫీ తీసుకుంటున్నారని అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details