ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగనన్న రాకముందే సభా ప్రాంగణం ఖాళీ - వైన్స్​ వద్దే వైఎస్సార్సీపీ కార్యక్తలు - No Public in Jagan public Meeting

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 1:46 PM IST

No Public in CM Jagan Meeting at Anakapally District : వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్​ అనకాపల్లి జిల్లా చోడవరంలో సభ నిర్వహించారు. అయితే జగన్​ ప్రచార సభ విఫలమైంది. ఉదయం ఎనిమిది గంటలకు సమావేశం అని చెప్పడంతో వివిధ ప్రాంతాల ప్రజలు సభా ప్రాంగణానికి హాజరయ్యారు. అయితే జగన్ 11 గంటలు దాటిన తర్వాత హెలికాప్టర్లో వచ్చినప్పటికీ సభ ప్రారంభానికి ముందే జనాలు తిరుగు ముఖం పట్టారు. ఓ పక్క జగన్ ప్రసంగిస్తుండగా చోడవరంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద వైఎస్సార్సీపీ కార్యక్తలు బారులు తీరడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 

CM Jagan Public Meeting Failed In Chodavaram : సీఎంకి తమ బాధలు చెప్పుకుందామని వచ్చినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించకపోవటంతో వెళ్లిపోతున్నామని పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు. తాము నిరంతరం కష్టపడుతున్నప్పటికీ ఆశాజనకమైన వేతనాలు అందించడానికి తాము ఎన్నో మార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం లేదని పారిశుద్ధ్య కార్మికులు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details