ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కనిగిరి డిపోలో ఆదాయం ఫుల్​ - కనీస వసతులు నిల్​ - Passengers Problem in Kanigiri

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 1:00 PM IST

No Facilities in Kanigiri RTC Depo Prakasam District : కనిగిరి ఆర్టీసీ బస్టాండ్​లో సమస్యలు ప్రయాణికులను వెక్కిరిస్తున్నాయి. రాష్ట్రంలో ఆదాయం తెచ్చే డిపోల్లో కనిగిరి మొదటి వరుసలో ఉన్నా వసతుల కల్పనలో మాత్రం వెనుకంజలోనే ఉంది. నిత్యం ప్రయాణికుల రద్దీ, సరకు రవాణాతో ఆదాయం ఆర్జిస్తున్నప్పటికీ బస్టాండ్​లో (Depo) కాసేపు కూర్చోవాలంటే సగటు ప్రయాణికుడు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. 

కనిగిరి డిపోలో ఆర్టీసీ బస్సులు 83, అద్దె బస్సులు 20 ఉన్నాయి. రోజూ 45,878 కిలోమీటర్ల మేర బస్సులు జిల్లాతోపాటు, హైదరాబాద్, కర్ణాటక, తెలంగాణ (Telangana), విజయవాడ, విశాఖ పట్టణం, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తుంటాయి. బస్టాండ్​కు వచ్చిన ప్రయాణికులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. ఎప్పుడో 25 ఏళ్ల నాడు నిర్మించిన మరుగు దొడ్లు పాచి పట్టి దుర్వాసన వస్తున్నాయి. లోపలకు వెళ్లాలంటే ముక్కుపుటాలు అదిరిపోతున్నాయని ప్రయాణికులు భయపడుతున్నారు. కొత్తగా రెండు మరుగు దొడ్లు నిర్మించినా, నీళ్లు లేవనే కారణంతో వాటిని ఉపయోగించకుండా వదిలేశారు. ప్రయాణికుల ద్వారా ఏడాదికి రూ.కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతున్నా కనీసం శుద్ధి జలం కూడా ఏర్పాటు చేయలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటేటా ఛార్జీలు పెంచి ముక్కుపిండి వసూలు చేయడమే కాదు, కనీస వసతులు కల్పించాలని ప్రయాణికులు (Passengers) కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details