LIVE : పార్లమెంట్ బడ్జెట్‌పై ప్రత్యేక చర్చ - ప్రత్యక్షప్రసారం - budget session - BUDGET SESSION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 11:02 AM IST
|Updated : Jul 23, 2024, 3:07 PM IST
Union Budget 2024 LIVE : కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత ప్రాధాన్యం లభించింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజధాని అమరావతికి 15 వేల కోట్ల ప్రత్యేత సాయాన్ని అందిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రాయలసీమతో పాటు ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద సాయం చేస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లోని ఓర్వకల్లు నోడ్‌లకు పారిశ్రామిక అభివృద్ధికి, మౌలిక అవసరాలైన నీరు, విద్యుత్, రైల్వే, రహదారుల అభివృద్ధికి సహరిస్తామన్నారు. వీటి ఏర్పాటుకు అవసరమైన మూలధన వ్యయం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు అందిస్తామన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రత్యేక చర్చ ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.
Last Updated : Jul 23, 2024, 3:07 PM IST