LIVE : దిల్లీలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ - ప్రత్యక్షప్రసారం - NDA MPs Meet at Parliament Live - NDA MPS MEET AT PARLIAMENT LIVE
Published : Jun 7, 2024, 12:40 PM IST
|Updated : Jun 7, 2024, 6:44 PM IST
NDA MPs Meet at Parliament Live : ప్రధాని నరేంద్రమోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకునేందుకు ఆ కూటమి తరఫున గెలిచిన ఎంపీలంతా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎన్డీఏ కీలకనేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు ఎన్డీయే ఇతర ఇతర ముఖ్యనేతలంతా ఈ భేటీకి హాజరయ్యారు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలతోపాటు బీజేపీ పదాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో లాంఛనంగా నరేంద్రమోదీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకోనున్నారు.ఆ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌కుమార్‌సహా ఇతర ఎన్డీయే ముఖ్యనేతలతో కలిసి నరేంద్రమోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఎన్డీయే పక్షనేత ఎన్నికకు సంబంధించి ఎంపీల సంతకాలతో కూడిన లేఖను సమర్పించనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కోరనున్నారు. మరోవైపు ఈనెల 9న మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయనున్నారు. కర్తవ్యపథ్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. కొత్త కేబినెట్‌లో ఎవరెవరూ ఉండాలనే విషయమై బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ నిన్న భాజపా అధ్యక్షుడు జేడీ నడ్డా నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఎన్టీయే ఎంపీల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యక్షప్రసారం.
Last Updated : Jun 7, 2024, 6:44 PM IST