LIVE: అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర పవన్ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - NDA LEADERS PRESS MEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2025, 12:55 PM IST
NDA Leaders Press Meet on YSRCP And Governor Speech LIVE : ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారన్నారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని హర్షం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు, మెగా డీఎస్సీ దస్త్రంపై సంతకం చేశారన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని హామీ ఇచ్చారు. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని ఆ పార్టీ సభ్యుల నినాదాలు చేశారు. వారి నినాదాల మధ్యే గవర్నర్ ప్రసంగం కొద్దిసేపు సాగింది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలపై ఎన్డీఏ ప్రత్యక్ష ప్రసారం.