ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అసమ్మతి నేతల రహస్య సమావేశం - "ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సహకరించొద్దు" - వైసీపీ అసమ్మతి నేతల సమావేశం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 30, 2024, 12:15 PM IST

NarasaRaopeta YSRCP Dissident Leaders Meeting : శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ కేటాయిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని వైఎస్సార్సీపీ అసంతృప్త వర్గ నేత, బాపట్ల పరిశీలకుడు గజ్జెల బ్రహ్మారెడ్డి సోమవారం రాత్రి తన అనుచరులతో అన్నట్లు సమాచారం. పల్నాడు జిల్లా నరసరావుపేట ఇస్లాంపేటలోని ముస్లిం సోదరులతో ఆయన సోమవారం రాత్రి రహస్య సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం పని చేశామని, ఇక ఆయనకు సహకరించొద్దని సూచించారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయకుంటే అప్పుడు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించినట్లు సమాచారం. 

Meeting Against MLA Gopireddy Srinivasa Reddy : ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీరుతో నష్టపోయిన బాధితులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని బ్రహ్మారెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హనీఫ్, మాజీ కౌన్సిలర్ చల్లా శ్రీనివాసరావు, నాయ కులు ఓబుల్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details