ETV Bharat / state

ఊరూ వాడ సంక్రాంతి శోభ- సందడంతా చిన్నారులు, యువతదే - STATEWIDE PRE SANKRANTI CELEBRATION

అంబరాన్నంటుతున్న ముందస్తు సంక్రాంతి సంబరాలు- ముగ్గుల పోటీలు, ఎడ్లు, కోళ్ల పందేలతో సందళ్లు

statewide_pre_sankranti_celebration_in_andhra_pradesh
statewide_pre_sankranti_celebration_in_andhra_pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 12, 2025, 1:19 PM IST

Statewide Pre -Sankranti Celebration in Andhra Pradesh : చిన్నారులు, యువత ఆటపాటలు పండు వెన్నెలను పోలిన వెండి ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ముందస్తు వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువజనులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోటీల్లో పాల్గొంటూ పతంగులు ఎగురవేస్తూ సంక్రాతి శోభతో అలరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి అనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది. రంగువల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువులతో గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో సంక్రాంతి పండుగను విద్యార్థులు నిర్వహించారు. భావితరాలకు పండుగ సాంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు విజ్ఞాన్స్ విద్యా సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య తెలిపారు.

ఏఆర్​ పోలీసు గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. మహిళా పోలీసు సిబ్బంది వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి పశుపోషకులు పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేశారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భోగిమంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు అందరిని అలరించాయి. ముగ్గుల పోటీల్లో విజేతలుగా గెలిచినవారికి గృహోపకరణాలు బహుమతులుగా అందించారు.

కాలు దువ్వుతున్న కోళ్లు - అనుమతులు లేవంటున్న పోలీసులు

దానవాయిపేట నగరపాలక పాఠశాలలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిడదవోలు మండలం విజ్జ్వేశ్వరంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆత్రేయపురంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.

మన్యం జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులు తిలకించారు. విశాఖలోని ప్రేమ్‌ సదన్‌ మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గులపోటీలు నిర్వహించారు. వైఎస్సార్​ జిల్లా జమ్మలమడుగు మండలం S. ఉప్పలపాడు గ్రామంలో జ్ఞాన పార్వతి విద్యామందిరంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో విదేశీయులు సందడి చేశారు.

పందెంరాయుళ్ల హవా- కోట్లలో కోడి పందేలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.