Balakrishna Inaugurated Oncology Unit at Hyderabad Cancer Hospital : బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని మరింత విస్తరించనున్నామని ఆస్పత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్‌ను ప్రారంభించిన అనంతరం బాలకృష్ణ మాట్లాడారు. ఇవాళ పీడియాట్రిక్ వార్డు, పీడియాట్రిక్ ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని పేర్కొన్నారు. విస్తరణలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు.
పీడియాట్రిక్ వార్డు, ఐసీయూను ప్రారంభించడం సంతోషంగా ఉందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. క్యాన్సర్‌తో ఎంతోమంది బాధపడుతున్నారు. ఇప్పటివరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని, ఆర్థిక స్థోమత లేని వారికి వైద్యం అందించడమే మా లక్ష్యమ బాలకృష్ణ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు.
నట సింహానికి ‘పద్మభూషణ్’ - బాలయ్య సేవలను కొనియాడిన కేంద్రం
Balakrishna Suprises Thaman With Costly Car : సంగీత దర్శకుడు తమన్‌కు బాలయ్య స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తమన్ ప్రతిభను అభినందిస్తూ భారీ కానుక అందించారు. ఈమేరకు తాజాగా ఖరీదైన పోర్షే కారును కొనుగోలు చేసి తమన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్‌లోని క్యాన్సర్ ఆస్పత్రిలో ఆంకాలజీ యూనిట్ ప్రారంభోత్సవంలో ఆయన తమన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘తమన్ నాకు తమ్ముడితో సమానం. వరుసగా నాలుగు హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు బహుమతి ఇచ్చాను. భవిష్యత్తులోనూ మా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది’’ అని అన్నారు.
అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి - 15 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం