ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉపాధి కోసం యువత వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి వచ్చింది: ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు - ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 9:55 PM IST

Narasaraopet MP Lavu Sri Krishna Devarayalu: వైఎస్సార్సీపీ పాలనలో ఉపాధి కోసం యువత వలస వెళ్లిపోవాల్సిన దుస్థితి వచ్చిందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ కార్యాలయంలో, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ సభ్యులు, లాయర్లతో ఆయన భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని వ్యాపారులను ఆయన కోరారు. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టుల అనుసంధానం, యువతకు ఉపాధి, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్‌లో 100 పడకల ఆసుపత్రిని అభివృద్ధి చేయాలన్నారు. 

నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పల్నాడులో పీఎం గతిశక్తి కింద లాజిస్టిక్ హబ్​ను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. వ్యాపారులు, యువత ముందుకు వచ్చి తన ఆలోచనను ప్రజలకు తెలిసేలా కృషి చేయాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. నాలుగున్నరేళ్లుగా స్థానిక నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేతల అరాచకాలు పెరిగిపోయాయని తెలుగుదేశం నేత చదలవాడ అరవింద బాబు మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details