ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: రాయదుర్గంలో నారా లోకేశ్ శంఖారావం సభ- ప్రత్యక్షప్రసారం - Nara Lokesh Sankharavam Sabha Live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 10, 2024, 3:19 PM IST

Updated : Mar 10, 2024, 3:57 PM IST

Nara Lokesh Sankharavam Sabha in Rayadurgam Live: రాయలసీమలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెండో విడత 'శంఖారావం' పర్యటనలు ప్రారంభం అయ్యాయి. గురువారం నారా లోకేశ్ హిందూపురం నుంచి 'శంఖారావం' ప్రారంభించారు. ప్రస్తుతం అనంతపురం జిల్లా రాయదుర్గం సభలో పాల్గొన్నారు. వైసీపీ హయాంలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారని, 300 మందిని హత్య చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. బీసీలకు రావాల్సిన రూ.25 వేల కోట్లను వైసీపీ ప్రభుత్వం దారిమళ్లించిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత 50 ఏళ్లు పైబడిన బీసీలకు ప్రతి నెలా 4 వేల రూపాయలు అందించబోతున్నామని తెలిపారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాబోతున్నామన్న లోకేశ్, బీసీలకు స్వయం ఉపాధి కోసం ఐదేళ్లలో 10 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. కాగా ప్రస్తుతం రాయదుర్గం నియోజకవర్గంలో నారా లోకేశ్ శంఖారావం ప్రత్యక్షప్రసారం మీ కోసం..
Last Updated : Mar 10, 2024, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details