అక్కున చేర్చుకుని, ఆప్యాయంగా ఎత్తుకుని - స్కూలు చిన్నారులతో నారా భువనేశ్వరి సందడి - Nara Bhuvaneswari NTR district
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 10, 2024, 12:54 PM IST
|Updated : Feb 10, 2024, 2:29 PM IST
Nara Bhuvaneswari Nijam Gelavali Yatra in NTR District : నిజం గెలవాలి పర్యటనకు వెళ్లిన తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన మహిళల వద్ద ఉన్న చిన్నారులను నారా భువనేశ్వరి ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. వారితో ముచ్చటించి వారికి చాక్లెట్లు ఇచ్చారు. బాగా చదువుకోవాలని సూచించారు. తల్లుల వద్దనున్న పసిపిల్లలను ఆప్యాయంగా ఎత్తుకున్నారు. తమ పిల్లలను ఎత్తుకోవడం పట్ల తల్లులు అమితానందానికి గురయ్యారు.
జగ్గయ్యపేట మండలంలోని, గౌరవరం గ్రామంలోకి భువనేశ్వరి కాన్వాయ్ వస్తోందని వేదవిద్యావన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పిల్లల వ్యాన్ను పోలీసులు ఓ సందులోకి మళ్లించారు. అటుగా వెళ్తున్న స్కూల్ వ్యాన్ను భువనేశ్వరి గమనించి, దిగివెళ్లి విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. స్కూలు విద్యార్థులు కూర్చున్న వ్యానులో వారితో కలిసి కూర్చున్నారు. పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చి ఎలా చదువుతున్నారు? బాగా చదవండి, మీ తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురండి అని సూచించారు. తమ వద్దకు భువనేశ్వరి రావడంతో స్కూలు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం భువనేశ్వరికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.