తెలంగాణ

telangana

ETV Bharat / videos

మహిళల హెప్టథ్లాన్‌లో స్వర్ణం సొంతం చేసుకున్న అగసర నందిని - Nandini wins gold Medal - NANDINI WINS GOLD MEDAL

By ETV Bharat Telangana Team

Published : May 16, 2024, 2:24 PM IST

Nandini wins gold Medal in womens heptathlon : గత కొంతకాలంగా వేర్వేరు వేదికలపై మెరుగైన ప్రదర్శనలతో సత్తా చాటుతూ వచ్చిన తెలంగాణ అథ్లెటిక్ అగసర నందిని సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భువనేశ్వర్ వేదికగా జరిగిన ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్​లో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి, ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ అగసర నందిని సత్తా చాటింది. మహిళల హెప్టథ్లాన్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. 5 వేల 460 పాయింట్లతో అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. కేరళకు చెందిన అనామిక రజతం, తమిళనాడుకు చెందిన దీపిక కాంస్యం సాధించారు. 

Nandini wins gold Medal in Athletes : హెప్టథ్లాన్‌లో భాగంగా వంద మీటర్ల హర్డిల్స్‌ను 14.21 సెకన్లలో ముగించిన నందిని, 200 మీటర్ల పరుగులో 25.23 సెకన్ల టైమింగ్ నమోదు చేసింది. మధ్యలో హైజంప్ 1.64 మీటర్లు, షాట్ పుట్ 12.23 మీటర్లలోనూ రాణించింది. లాంగ్ జంప్ 5.64 మీటర్లు, జావెలిన్ త్రో 41.13 మీటర్లు, 800 మీటర్ల పరుగు 2 నిమిషాల 25.06 సెకండ్లలోనూ అదరగొట్టింది. 

ABOUT THE AUTHOR

...view details