ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

వైఎస్సార్సీపీ విధేయ వీసీ రాజీనామా- ఉద్యోగులు, విద్యార్థుల సంబరాలు - ANU VC Rajasekhar Resigned - ANU VC RAJASEKHAR RESIGNED

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 4:39 PM IST

Acharya Nagarjuna University VC Rajasekhar Resigned : వైఎస్సార్సీపీకి అనుకూలంగా కార్యక్రమాలు నిర్వహించిన గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ రాజీనామాతో ఉద్యోగులు, విద్యార్థి సంఘాల సంబరాలు సంబరాలు చేసుకున్నారు. యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద బాణసంచా కాల్చారు. రాజశేఖర్ మూడు రాజధానులకు మద్దతుగా సదస్సులు నిర్వహించారని ఉద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. యూనివర్సిటీలో రాజశేఖర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటిని బైట పెడతామన్నారు.

రెండు రోజుల క్రితం తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించిన రాజశేఖర్ ఇవాళ అధికారికంగా వీసీ పదవి నుంచి వైదొలిగారు. దీంతో యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు టపాసులు కాల్చి సంబరాలు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకుని ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్శిటిలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసి సజ్జలను, వైఎస్సార్సీపీ నేతలతో ఆవిష్కరింపజేశారు.విశ్వవిద్యాలయంలో ఆచార్యులు, ఉద్యోగుల నియామకాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారు. రూసా నిధులను యూనివర్శిటి అభివృద్ధి, విద్యా సంబధిత కార్యకలాపాల కోసం వినియోగించకుండా దారి మళ్లించారు. రాజకీయ కార్యకలాపాలకు విశ్వవిద్యాలయాన్ని వేదికగా మార్చారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details