ETV Bharat / state

వచ్చినా రానట్టే - 60 రోజులు రాకపోతే జగన్ సభ్యత్వం రద్దు అవుతుందా? - JAGAN MEMBERSHIP DISQUALIFICATION

జగన్ శాసనసభ్యత్వం రద్దు అవుతుందా అనే సందేహాలు - అసెంబ్లీలో అధికారికంగా సంతకం చేయని జగన్‌ - రెండుసార్లూ గవర్నర్‌ ప్రసంగం రోజునే సభకు వచ్చిన జగన్‌

YS Jagan
YS Jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2025, 8:19 AM IST

YS Jagan MLA Membership Disqualification: జగన్ శాసనసభ్యత్వం రద్దు అవుతుందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తర్వాత అసెంబ్లీలో అధికారికంగా సంతకం చేయకపోవటంతో ఆయన సభ్యత్వం రద్దు అంశంపై చర్చ జరుగుతోంది.

హాజరు నమోదు కాలేదు: ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధ్యక్షుడు జగన్ శాసనసభ్యత్వంపైనే ఇప్పుడు సందేహాలు రేగుతున్నాయి. 60 రోజుల పనిదినాల్లో కనీసం ఒక్కరోజైనా అసెంబ్లీకి హాజరుకాకపోతే శాసనసభ సభ్యత్వం రద్దవుతుందన్న నిబంధన ఆయనకు వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 సాధారణ ఎన్నికలు పూర్తయ్యాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి మాత్రమే జగన్ హాజరయ్యారు. తర్వాత అసెంబ్లీలో ఆయన హాజరు నమోదు కాలేదు. సాంకేతికంగా ఆయన గవర్నర్ ప్రసంగానికి వచ్చినా జగన్ హాజరు మాత్రం నమోదు కాలేదు.

శాసనసభకు హాజరుకానట్టే: గత ఏడాది జూలైలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన సమయంలో శాసనసభకు వచ్చిన జగన్ ప్రస్తుతం బడ్జెట్​ సమావేశాల్లోనూ ఫిబ్రవరి 24న గవర్నర్​ ప్రసంగానికి వచ్చి కొద్దిసేపు ఉండి వెళ్లారు. అయితే నిబంధనల ప్రకారం ఈ రెండు రోజులూ శాసనసభ జరిగినట్టు అధికారికంగా పరిగణించకపోవటంతో జగన్ శాసనసభకు హాజరుకానట్టుగానే స్పష్టమవుతోంది.

వాస్తవానికి ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసే ప్రసంగాన్ని శాసనసభ, మండలి వేర్వేరుగా తమ రోజువారీ అజెండాలో బిజినెస్​గా చేర్చుకుని ఆ తీర్మానంపై చర్చించినప్పుడే అది ప్రోసీడింగ్స్​లోకి చేరుతుందని, అదే ఆయా సభలకు బిజినెస్ డేగా లెక్కించాల్సి ఉంటుందని శాసనసభా వ్యవహారాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్పటివరకూ అది అసెంబ్లీ లేదా మండలి బిజినెస్‌గా పరిగణించరని తేల్చి చెబుతున్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం విధాన పరిషత్​కు ఎగ్జిక్యూటివ్ హెడ్‌గా గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, ఆ ప్రసంగాన్ని శాసనపరిషత్ కార్యదర్శి అధికారికంగా టేబుల్ చేసిన తర్వాత మాత్రమే అది సభ ప్రోసీడింగ్స్​లోకి వస్తుందని నిబంధనలు చెబుతున్నాయి. సాంకేతికంగా గవర్నర్ ఉభయసభలకు చెందిన సభ్యుడు కాకపోవటంతో ఆయన ప్రసంగాన్ని మాత్రమే శాననసభ పరిగణనలోకి తీసుకుంటుంది.

60 రోజుల వ్యవధి దాటిపోయింది: గవర్నర్ ప్రసంగం చేసిన రోజు అధికారికంగా శాసనసభ జరిగినట్టు కాదని, నిపుణులు తేల్చిచెబుతున్నారు. ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టిన రోజే శాసనసభ లేదా మండలికి అధికారిక బిజినెస్ డే అవుతందని స్పష్టం చేస్తున్నారు. రెండుసార్లూ జగన్ వచ్చిన రోజులు శాసనసభ బిజినెస్ డే గా నమోదు కాకపోవటంతో ప్రస్తుతం ఆయన హాజరుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

11 నిమిషాలు నినాదాలు - గవర్నర్ ప్రసంగాన్ని బాయ్‌కాట్ చేసిన వైఎస్సార్సీపీ

అడిగితే కాదు ప్రజలిస్తే వచ్చేది - ఫిక్స్​ అయిపోండి ప్రతిపక్ష హోదా రాదు: పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.