Daggubati Venkateswara Rao Met CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబును ఆయన నివాసంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కలిశారు. ఆయన రచించిన "ప్రపంచ చరిత్ర" (ఆది నుంచి నేటి వరకు) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబును ఆహ్వానించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లిలో తొలిసారి చంద్రబాబు నివాసానికి వచ్చారు. చాలా కాలం తర్వాత ఇద్దరు తొడల్లుళ్లు కలుసుకోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పుస్తకావిష్కరణకు చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు.