నాగార్జునసాగర్ డే విజువల్స్ చూశారా? - అద్దిరిపోయాయి గురూ - NAGARJUNA SAGAR DAM GATES LIFTED
Published : Aug 9, 2024, 11:59 AM IST
Nagarjuna Sagar Dam Gates Lifted : నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 22 గేట్లను 5అడుగుల మేర, మరొక 4 గేట్లను 10 అడుగుల వరకు ఎత్తేశారు. కాగా సాగర్లోకి ఇన్ ఫ్లో 2లక్షల 73వేల 915 క్యూసెక్కులు వస్తుండగా, ఔట్ ఫ్లో 2లక్షల 28వేల 24 క్యూసెక్కులుగా ఉంది.
సాగర్ కుడి, ఎడమ కాల్వలకు సాగు నీరు విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి 28 వేల క్యూసెక్కుల నీరు వెళ్తోంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590.00 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులకు చేరుకుంది. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తతం 303.94 టీఎంసీలుగా ఉంది. జలాశయం నిండుకుండను తలపిస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటకులు ప్రాజెక్టు జలకళను చూసి ఆనందంతో ఫొటోలు తీసుకుంటున్నారు.