రూ.700 కోసం హత్యాయత్నం - కత్తితో పొడిచి దాడి - MURDER ATTEMPT FOR RS 700 IN HYD - MURDER ATTEMPT FOR RS 700 IN HYD
Published : Jul 7, 2024, 1:00 PM IST
Murder Attempt For RS.700 in Old City Hyderabad : 700 రూపాయల కోసం యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. కాలపత్తర్ ప్రాంతంలో అలీం అనే వ్యక్తిపై దాడి చేసి దుండగుడు పారిపోయాడు. రక్తపుమడుగులో ఉన్న బాధితున్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలీం అనే వ్యక్తి దుండగుడి దగ్గరకు వచ్చాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఒక్కసారిగా ఇద్దరు గొడవ పడటం మొదటుపెట్టారు. పరస్పరం ఇద్దరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో దుండగుడు అలీం అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. చుట్టుపక్కల వ్యక్తులు వచ్చి ఆపేసరికి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు కత్తితో దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. బాధితుడు, నిందితుడు ఇద్దరు పరిచయస్తులు అని ఇద్దరి మధ్య రూ.700 కోసం వివాదం జరిగి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.