కుళ్లిన మాంసం, బూజుపట్టిన కూరగాయలు - మెదక్ హోటళ్లలో అవాక్కయ్యే నిజాలు - Food Inspections IN medak HOTELS - FOOD INSPECTIONS IN MEDAK HOTELS
Published : Jul 11, 2024, 5:42 PM IST
Municipal Officers Inspections in Medak Hotels : మెదక్ పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన 70కిలోల మాంసం, కూరగాయలను గుర్తించి జరిమానాలు విధించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రాయల్ మండి రెస్టారెంట్‌కు రూ.10వేలు, అరేబియన్ రెస్టారెంట్‌కు రూ.5వేలు, బాలాజీ మిఠాయి బండార్‌కు వేయి రూపాయల జరిమానా విధించారు. కుళ్లిన 70కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్ట్‌కు తరలించారు. మరొక హోటల్లో వండిన మాంసాన్ని ఫ్రిజ్‌లో పెట్టి దాన్నే వేడి చేసి కస్టమర్స్‌కు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
చికెన్ షాపులు పదుల సంఖ్యలో అందుబాటులోకి ఉన్నప్పటికీ ఎందుకు ముందుగా తీసుకొచ్చి నిల్వ ఉంచుతున్నారని హోటల్ యజమానులను ప్రశ్నించారు. తినడానికి చిన్నపిల్ల నుంచి వృద్ధుల వారు వస్తారని వారికి ఇలాంటి ఆహారం పెడితే ఆనారోగ్యం పాలవుతారని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా హోటళ్లు నిర్వహిస్తే జరిమానాలతో పాటు అవసరమైతే హోటళ్లను సైతం సీజ్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఛైర్మన్ జానకిరామ్ సాగర్ హెచ్చరించారు.