ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బారా షహీద్ దర్గా రొట్టెల పండుగకు సర్వం సిద్ధం- నెల 17నుంచి వేడుకలు - Nellore Rottela Festival 2024 - NELLORE ROTTELA FESTIVAL 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 15, 2024, 10:12 AM IST

Muharram Nellore Rottela Festival Bara Shaheed Dargah 2024 : నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 17న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయ‌ణ‌, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రులకు ద‌ర్గా క‌మిటీ స‌భ్యులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అంద‌రం స‌మ‌న్వయంతో ప‌ని చేసి రొట్టెల పండుగ‌ను విజ‌య‌వంతం చేస్తామని కమిటీ తెలిపింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు ఆదేశించారు. 

నెల్లూరు నగరంలో రొట్టెల పండుగ జరిగే బారా షహీద్​ దర్గా ప్రాంతం రాత్రి సందడిగా మారింది. విద్యుత్ కాంతులతో నెల్లూరు నగరాన్ని అలంకరించారు. ఐదు రోజుల‌పాటు జ‌రిగే రొట్టెల పండుగ‌కు వచ్చే ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌కి అన్ని సౌకర్యాలకు తగిన ఏర్పాట్లు చేయాలని ద‌ర్గా క‌మిటీతోపాటు జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, కార్పొరేష‌న్‌, సంబంధిత శాఖ‌ల అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయాల‌ని మంత్రులు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details