ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ముద్దినాయనపల్లి చెరువుకు గండి - వృథాగా నీరు - Muddinayanapalli Pond Inundated

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2024, 12:19 PM IST

Muddinayanapalli Pond Inundated , Villagers Put Sandbags to Block Flood Water : ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం జలమయమైంది. ముద్దినాయనపల్లి చెరువుకు బుధవారం రాత్రి గండి పడింది. దీంతో గ్రామంలోకి వరద నీరు రాకుండా గ్రామస్థులు ఇసుక మూటలు అడ్డుగా వేశారు. ఎంత ప్రయత్నించినా చెరువు గట్టు తెగి నీరు వృథాగా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. కోస్తాంధ్రాలో కురిసిన ఎడతెరపి లేని వర్షాలు రైతులకు కడగండ్లను మిగిల్చాయి. వర్షపు నీటికి పంట పూర్తిగా తడిచిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కుండపోత వానలకు వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు ప్రాంతాల్లో ప్రధాన రోడ్లపైన, లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల్లో వర్షపు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుత్తి మున్సిపల్‌, వ్యవసాయ కార్యాలయం, బాలుర వసతి గృహాల్లోకి వర్షపు నీరు చేరి చెరువును తలపించాయి.

ABOUT THE AUTHOR

...view details