స్వీపర్ కాళ్లు కడిగి పాదాభివందనం చేసిన ఎంపీపీ దంపతులు - వీడియో వైరల్ - MPP Foot Salutation To sweeper - MPP FOOT SALUTATION TO SWEEPER
Published : Jul 26, 2024, 3:34 PM IST
Salutation To Sweeper in Bhadradri : తనకు ఇన్నాళ్లు సేవలందించిన ఒక స్వీపర్‌కు ఓ ఎంపీపీ ఆమె కాళ్లు కడిగి పాదాభివందనం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే అశ్వరావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన ముందస్తుగా పదవీ విరమణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన కార్యాలయాన్ని శుభ్రపరుస్తూ సేవలందించిన స్వీపర్ కుమారి కాళ్లను స్వయంగా ఎంపీపీ సతీసమేతంగా కడిగారు.
వెంటనే ఆ నీటిని ఎంపీపీ దంపతులు తమ తలపై చల్లుకున్నారు. అంతేకాదు స్వీపర్ కాళ్లకు పుష్పాలతో పాదాభివందనం చేసి ఆమె దీవెనలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇది ఆ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ సందర్భంగా ఎంపీపీ శ్రీరామమూర్తి మాట్లాడుతూ స్వీపర్ కుమారి ప్రతిరోజు ఉదయమే తన గదిని శుభ్రపరచటంతో పాటు తనకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఆమె తనకు సేవలు అందించినందుకు కృతజ్ఞతగా కాళ్లు కడిగి పాదాభివందనం చేసినట్లు వివరించారు.