దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తారు: ఎంపీ రామ్మోహన్ నాయుడు - mp ram mohan election campaign - MP RAM MOHAN ELECTION CAMPAIGN
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 11, 2024, 1:40 PM IST
MP Kinjarapu Ram Mohan Naidu Election Campaign: సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనతో విసుగెత్తిన ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటింటా ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్‌తో కలిసి ఎంపీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను హారతులతో మహిళలు ఆశీర్వదించారు. ఒక పండగ వాతావరణంలో ప్రచారం సాగుతోందని ఎంపీ రామ్మోహన్ తెలిపారు.
దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గత పది సంవత్సరాలుగా మోదీ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రానికి చంద్రబాబు ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అదే విధంగా యువశక్తితో రాజకీయాలలో పెనుమార్పును తీసుకురావడానికి పవన్ కల్యాణ్ కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్టాన్ని, దేశాన్ని మార్చే సత్తా ఈ ముగ్గురికీ ఉందని, రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రామ్మోహన్ నాయుడు ధీమా వ్యక్తం చేశారు.