'ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్ర చిహ్నంలో మార్పులు - అందరితో చర్చించాకే సీఎం రేవంత్ నిర్ణయాలు' - MLC Mahesh kumar Comments on BRS - MLC MAHESH KUMAR COMMENTS ON BRS
Published : May 31, 2024, 3:22 PM IST
MLC Mahesh Kumar Goud Comments on BRS : రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉంటే కేసీఆర్, కేటీఆర్‌లకు అభ్యంతరం ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. అమరవీరుల స్థూపాన్ని చిహ్నంలో తీసుకొస్తే కేసీఆర్ మరుగున పడిపోతారని ఈ రాద్దాంతం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ అఖిలపక్ష సమావేశం ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? అని ప్రశ్నించిన ఆయన, అందరితో చర్చించిన తర్వాతే రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. అలానే తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో నియంత పాలన ఉండదని స్పష్టం చేశారు. ప్రజల కోరిక మేరకు రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారన్నారు. లోటుపాట్లు, అభ్యంతరాలు లేకుండా చిహ్నం రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందని, ఆవిర్భావ దినోత్సవానికి అమరవీరుల కుటుంబాలను పిలిచి సముచిత స్థాయిలో సత్కరిస్తామన్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన అందరికీ గౌరవం దక్కాలని తమ ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న అందరికీ ఆహ్వానం ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.